'చెన్నై లవ్ స్టోరీ' ఫస్ట్ సింగిల్ రిలీజ్
కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. ఈ మూవీ నుంచి ‘గుర్తుందా’ అనే హృదయాన్ని హత్తుకునే లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. వినసొంపుగా సాగే ఈ మెలోడీ పాటలో కిరణ్, శ్రీగౌరిల కెమిస్ట్రీ ఫ్రెష్‌గా ఉంది. ఒక క్యూట్ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఈ పాటతో అంచనాలు పెరిగాయి.