VIDEO: ధర్మవరంలో ఎస్.ఎఫ్.ఐ విద్యార్థి సంఘం ఆందోళన

సత్యసాయి: ధర్మవరంలో ఏపీ ఎస్.ఎఫ్.ఐ విద్యార్థి సంఘం శనివారం ఆందోళన చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు, స్కూల్ కమిటీ సభ్యులు మాత్రమే ప్రవేశించాలన్న జీవోను వ్యతిరేకిస్తూ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద జీవో ప్రతులను దహనం చేశారు. ప్రధాన కార్యదర్శి బండి శివ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.