వైసీపీ విమర్శలు అర్థరహితం: భీమిలి ఎమ్మెల్యే

Vsp: సింహాచలం చందనోత్సవంలో గోడ కూలిన ఘటనపై వైసీపీ విమర్శలు అర్ధరహితమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మృతుల కుటుంబాలకు ఫార్మా కంపెనీల పరిహారాన్ని పోల్చడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్మా కంపెనీ ప్రమాదాల్లో మృతులకు రూ. కోటి చొప్పున పరిహారం అందించామని తెలిపారు. శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు.