VIDEO: ఘనంగా ముగిసిన పిఠాపురం దత్త జయంతి ఉత్సవాలు
కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో త్రిమూర్తి స్వరూపమైన దత్త జయంతి వేడుకలు ఘనంగా ముగిసాయి. గురు దత్తాత్రేయ స్వామి వారికి సప్తహాల ముగింపు సందర్భంగా గ్రామోత్సవం నిర్వహించారు. అశేష భక్త జనం నడుమ దత్తాత్రేయ స్వామి వారిని ప్రత్యేక రథంపై కొలువు తీర్చి మేళ తాళాలు, సాంప్రదాయ నృత్యాలు, బాణాసంచా నడుమ దత్త దత్త గురు దత్త దత్త జయ దత్త అని భక్తులు కొనియాడారు.