విద్యార్థిని వేధింపు కేసులో నిందితుడికి 2 ఏళ్ల జైలు
WGL: విద్యార్థినిని 'ప్రేమించమని' బలవంతం చేసి వేధించిన కేసులో కాశిబుగ్గకు చెందిన నిఖిల్‌కు WGL పోక్సో కోర్టు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2021లో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో నేడు విచారణ పూర్తయింది. నేరం పూర్తిగా రుజువు కావడంతో ఇన్‌చార్జ్ జడ్జి క్షమాదేష్ పండేయ్ నిందితుడికి 2 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.6,000 జరిమానా వేశారు.