చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NRPT: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందని నారాయణపేట ఎమ్మెల్యే పర్నికా రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట ఆర్డీవో కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని వెల్లడించారు.