గ్యాస్ సరఫరాకు ఈ-కేవైసీ.. కేంద్రం క్లారిటీ
గ్యాస్ సరఫరాకు గృహ వినియోగదారులందరికీ బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ (ఈ-కేవైసీ) అవసరం తప్పనిసరి అని వస్తున్న వార్తలపై కేంద్రం స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల గ్యాస్ సరఫరాకు ఇబ్బందులు తలెత్తిన విషయం తెలిసిందే.