513 కిలోల గంజాయిని ధ్వంసం చేసిన పోలీసులు

MHBD: జి వ్యాప్తంగా సీజ్ చేయబడిన రూ. 1.28 కోట్ల విలువచేసే 513 కిలోల గంజాయిని జిల్లా పోలీసులు నేడు ధ్వంసం చేశారు. హన్మకొండ ఉర్సు గుట్ట ప్రాంతంలో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ పర్యవేక్షణలో మాదక ద్రవ్యాల నిరోధక శాఖ ఆదేశాల మేరకు డ్రగ్ డిస్పోసల్ కమిటీ సభ్యుల సమక్షంలో గంజాయి దహనం జరిగింది. డీఎస్పీ గండ్రతి మోహన్ పాల్గొన్నారు.