మోపిదేవిలో అంగన్వాడీ ఆయా దౌర్జన్యం

మోపిదేవిలో అంగన్వాడీ ఆయా దౌర్జన్యం

కృష్ణా: మోపిదేవి(M) పెదప్రోలు చైతన్యనగర్లో కోర్టు ఇంజక్షన్ ఉన్న స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి, సరిహద్దుగా ఉన్న దడిని పీకివేసిన అంగన్వాడీ ఆయా కొల్లూరి నాగమణిపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో ఉండాల్సిన ఆమె, విధులను వదిలి వివాదాస్పదంగా వ్యవహరించగా, పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.