'బ్రహ్మోత్సవాల పనులు వేగవంతంగా పూర్తి చేయాలి'

'బ్రహ్మోత్సవాల పనులు వేగవంతంగా పూర్తి చేయాలి'

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని TTD JEO వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఒంటిమిట్టలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. రామయ్య దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మార్చి 16 నుంచి నిత్య అన్నప్రసాద వితరణ ప్రారంభించనున్నారని తెలిపారు.