స్కూల్ బస్సుల్లో సీటు బెల్టులు: ఆమిర్ ఖాన్
రహదారి భద్రత విషయంలో తాను పక్కాగా వ్యవహరిస్తానని బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ తెలిపాడు. దేశంలో చాలా మంది పోలీసులను చూసి మాత్రమే హెల్మెట్లు ధరిస్తున్నారని అన్నాడు. కొందరైతే సీటు బెల్టు ధరించకుండా క్లిప్స్‌ను కొనుగోలు చేస్తున్నారని చెప్పాడు. చిన్నారుల భద్రత దృష్ట్యా స్కూల్ బస్సుల్లో సీటు బెల్ట్ తప్పనిసరి చేయాలని కేంద్రమంత్రి గడ్కరీకి ఆమిర్ విజ్ఞప్తి చేశాడు.