స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర పై అవగాహన కార్యక్రమం

KKD: రాజానగరం మండలం తూర్పుగోనగూడెం గ్రామంలో సర్పంచ్ గళ్ళా రంగారావు ఆధ్వర్యంలో ఇవాళ స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి తడి చెత్త - పొడి చెత్త సేకరణ పై ప్రజలకు అవగాహన కల్పించారు. స్వచ్చత, శుభ్రత విషయంలో ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.