యూరియా అందుబాటులో ఉండాలని వినతిపత్రం

MHBD: రైతులకు యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా బీజేపీ నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం ఉదయం వారు జాతీయ ST కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్‌ని కలిసి, వారికి వినతిపత్రం అందచేసారు. రైతులు సాగు చేసుకుంటున్న పంట పొలాలకు సరైన సమయంలో యూరియా అందుబాటులో లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారు హుస్సేన్ నాయకు వివరించారు.