VIDEO: గుడివాడ–ముదినేపల్లి రైల్వే గేట్ మూసివేత

VIDEO: గుడివాడ–ముదినేపల్లి రైల్వే గేట్ మూసివేత

కృష్ణా: రైల్వే ట్రాక్ మరమ్మతు పనుల కారణంగా గుడివాడ–ముదినేపల్లి రైల్వే గేటును ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు తాత్కాలికంగా మూసి వేయడం జరుగుతుందని రైల్వే అధికారులు ఈరోజు తెలిపారు. ఈ రైల్వే గేట్ ద్వారా ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఈ విషయాన్ని గమనించి వాహనదారులు సహకరించాలని వారు కోరారు.