'కేటీఆర్ చేతుల మీదుగా ముగ్గురికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు'
భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. కేటీఆర్ చేతుల మీదుగా ముగ్గురికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హక్కు పత్రాలు ఇచ్చి గృహప్రవేశాలు చేయించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల కోడ్ అదే రోజు అమలులోకి వచ్చిందని, నిజమైన లబ్ధిదారులను కలవాలనుకున్న వారిని పోలీసులు అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు.