అమరావతిలో వాజ్‌పేయి స్మృతి వనం
AP: రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని వాజ్‌పేయి స్మృతి వనం, విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర BJP నేత పాతూరి నాగభూషణం తెలిపారు. ఈ మేరకు వెంకటపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమీపంలో గల సుమారు 2.5 ఎకరాల భూమిని శనివారం ఆ పార్టీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. త్వరలోనే నిర్మాణాలకు భూమి పూజ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడే BJP రాష్ట్ర కార్యాలయం నిర్మించనున్నామన్నారు.