అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
HNK: గ్రేటర్ వరంగల్ 11వ డివిజన్ పరిధిలోని మున్నూరుకాపు వాడలో స్థానిక MLA నాయిని రాజేందర్ రెడ్డి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.90 లక్షలతో చేపట్టనున్న పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నానని, అభివృద్ధికి ప్రతిఒక్కరు సహకరించాలని MLA కోరారు.