కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీ బ్యాంక్ ఛైర్మన్
KDP: కలసపాడు మండలంలోని శంకవరంలో టీడీపీ కార్యకర్త ఉద్దండం మహేష్ భార్య సింధుజా కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా డీసీసీ బ్యాంక్ ఛైర్మన్ మంచూరు సూర్యనారాయణరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వారి కుటుంబాన్నికి తన వంతుగా ఆర్థిక సాయం అందించారు. పార్టీ పరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామి ఇచ్చారు.