VIDEO: సైబర్ నేరాలపై విద్యార్థుల 2K వాక్
PLD: నరసరావుపేటలో సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విద్యార్థులు శుక్రవారం భారీ 2K వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ మోసాలు, ఓటీపీ కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు తమ నృత్యాలు, కోలాట ప్రదర్శనల ద్వారా సైబర్ ప్రమాదాల గురించి ప్రజలకు ఆసక్తికరంగా వివరించారు.