విద్యుత్ సరఫరాకు అంతరాయం

విద్యుత్ సరఫరాకు అంతరాయం

ELR: 33/11 కేవీ లైన్‌ల మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు జంగారెడ్డిగూడెం EE పీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని అన్ని గ్రామాల్లోనూ, జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లోనూ సరఫరా ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.