VIDEO: అత్యంత కమనీయంగా శ్రీవారి కళ్యాణం
అన్నమయ్య: టీటీడీ వారి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి రాజంపేటలో శ్రీవారి కల్యాణం అత్యంత కమనీయంగా జరిగింది. రాజంపేట మండలం అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవంలో భాగంగా ఈ కళ్యాణం జరిగింది. నాయకులు అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తుండగా.. టీటీడీ వేద పండితులు సంప్రదాయబద్ధంగా కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించారు.