కాశీబుగ్గ తొక్కిసలాటలో 9మంది మరణించడం బాధాకరం

కాశీబుగ్గ తొక్కిసలాటలో 9మంది మరణించడం బాధాకరం

VZM: కాశీబుగ్గలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది మరణించడం బాధాకరమని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో వారి మృతికి సంతాపం తెలిపారు. ఈ ఆలయం ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నది కావడం, ముందుగా పోలీస్ వారికి ఎటువంటి సమాచారం లేకపోవడం వలన దుర్ఘటన జరిగిందని, దీనిపై కేబినెట్ సమావేశంలో చర్చిస్తామన్నారు.