హుండీ దొంగిలించిన దొంగ అరెస్ట్

హుండీ దొంగిలించిన దొంగ అరెస్ట్

ADB: పట్టణంలోని గోపాలకృష్ణ మఠం హుండీని దొంగిలించిన దొంగను వన్ టౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రకు చెందిన విఠల్ జాడే శుక్రవారం రాత్రి మఠంలోని హుండీని పగులగొట్టి నగదును తస్కరించాడు. మఠం సూపర్వైజర్ భూమయ్య వన్ టౌన్ లో ఫిర్యాదు చేయగా... పోలీసులు దర్యాప్తు జరిపి దొంగను అరెస్ట్ చేశారు.