VIDEO: ఆస్పత్రి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్
SRPT: కోదాడ పట్టణంలో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రి భవన పనులను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అదనపు కలెక్టర్ సీతారామారావుతో కలిసి సోమవారం పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న కలెక్టర్, నాణ్యతతో కూడిన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు త్వరగా అందుబాటులోకి రావాలని ఆయన స్పష్టం చేశారు.