కావూరి పార్థివ దేహానికి ఎమ్మెల్యే నివాళులు
ELR: కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు పార్థివ దేహానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పుష్పాంజలి ఘటించారు. గురువారం హైదరాబాదు చేరుకుని కావూరు సాంబశివరావు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కావూరి సాంబశివరావు లేరనే వార్త ఎంతో విచారకరమన్నారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.