మైసిగండి అమ్మవారిని దర్శించుకున్న మహేష్ కుమార్ గౌడ్
NGKL: జిల్లా పర్యటనలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రసిద్ధ మైసిగండి మైసమ్మ దేవాలయాన్ని సందర్శించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ మల్లు రవితో కలిసి ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు.