తుగ్గలిలో గోల్డ్ మైనింగ్‌పై ఆందోళన..!

తుగ్గలిలో గోల్డ్ మైనింగ్‌పై ఆందోళన..!

KRNL: తుగ్గలి మండలంలో గోల్డ్ మైనింగ్‌లో సైనేట్ వంటి ప్రమాదకర రసాయనాల వినియోగంతో భూగర్భ జలాలు, గాలి కాలుష్యం పెరుగుతోందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి టీజీ భారత్‌ను కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అక్కమ్మ వినతిపత్రం సమర్పించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని బీజేపీ నాయకులు కోరారు.