భారీ వర్షం.. రైతులకు శాపం

భారీ వర్షం.. రైతులకు శాపం

KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో యూరియా కోసం ఆందోళన పడిన రైతన్నలకు, తాజాగా కురుస్తున్న వానలు శాపంగా మారాయి. భారీ వర్షాలకు పంట తడిసి ముద్ద అవడంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వమే తక్షణమే ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.