ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ దొంగతనం
ASR: రాజవొమ్మంగి శివాలయం వీధిలో ఇంటి ముందు నిలిపి ఉంచిన మోటార్ సైకిల్ రాత్రికిరాత్రే దొంగతనానికి గురైంది. స్థానిక యువకుడు ఇల్లపు సతీష్ తన బైక్‌ను ఎప్పటిలాగే నిన్న రాత్రి ఇంటి ముందే పార్క్ చేశాడు. అయితే, ఇవాళ ఉదయం చూసేసరికి బైక్ కనిపించలేదు. దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అతడు తెలిపాడు.