ప్రైవేట్ వైద్య సంస్థలకు DMHO కీలక ఆదేశాలు

VZM: జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, ల్యాబ్, స్కానింగ్ సెంటర్‌లకు DMHO జీవన రాణి సోమవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ధరల పట్టికను అందరికీ కనిపించేలా తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం అనే బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలన్నారు.