పట్టణ అధ్యక్షుడి తల్లికి నివాళులు

పట్టణ అధ్యక్షుడి తల్లికి నివాళులు

సత్యసాయి: ధర్మవరం బీజేపీ పట్టణ అధ్యక్షుడు జింకా చంద్ర తల్లి, మాజీ కౌన్సిలర్ జింకా నాగ సుబ్బమ్మ (68) నిన్న రాత్రి అనారోగ్యంతో పరమపదించారు. ఈరోజు ఉదయం నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ హరీష్ బాబు వారి నివాసానికి వెళ్లి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.