శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం

శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం

ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గురువారం పోలీసులు మహిళల కోసం శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల మొబైల్ ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి, దాని పనితీరును, ఆపద సమయంలో ఎలా ఉపయోగపడుతుందో వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ ద్వారా పోలీసులను సంప్రదిస్తే తక్షణ సహాయం అందుతుందని పోలీసులు తెలిపారు.