ఘనంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
SRCL: చందుర్తి మండలం రామన్నపేట చందుర్తి అటవీ ప్రాంతాల మధ్యన వెలిసిన వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. వేద పండితుల మంత్రో చ్చరణల మధ్య స్వామి వారి కళ్యాణం నిర్వహించారు.