ఎమ్మిగనూరులో బాలుడికి విద్యుత్ షాక్
కర్నూలు: ఎమ్మిగనూరులోని యాక్సిస్ బ్యాంక్ సమీపంలో ఉన్న మున్సిపాలిటీ గ్రీవెల్ దాటుతుండగా ఓ బాలుడు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. స్థానికులు స్పందించి బాలుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలియజేశారు.