నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

VZM: బొబ్బిలి మండలం మక్కువ, నారసింహునిపేట సబ్‌స్టేషన్‌లో విద్యుత్ వైర్ల కింద ఉన్న చెట్టు కొమ్మలు తొలగించే కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు EE రఘు గురువారం తెలిపారు. ఈ మేరకు బొబ్బిలి మండలంలోని నారసింహునిపేట, గోపాలరాయుడుపేట, వెలగవలస, బొడ్డవలస, మక్కువ మండలంలోని కన్నంపేట, వెంకంపేట, తదితర గ్రామాలకు 9 నుంచి 3 వరకు విద్యుత్ ఉండదన్నారు.