‘అఖండ-2’ వాయిదాతో బాలయ్య అభిమానులకు నిరాశ

‘అఖండ-2’ వాయిదాతో బాలయ్య అభిమానులకు నిరాశ

ATP: అనంతపురంలో నటుడు బాలకృష్ణ అభిమానులకు నిరాశ ఎదురైంది. ‘అఖండ-2’ విడుదల అవుతుందని భావించి భారీ సంబరాలు నిర్వహించారు. MLA ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో అభిమానులు 110 కేజీల కేక్ కట్ చేసి ‘జై బాలయ్య’ నినాదాలతో నగరం మార్మోగించారు. అయితే, సినిమా అనూహ్యంగా వాయిదా పడటంతో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు. డిసెంబర్‌లోనా? సంక్రాంతికినా? విడుదలపై చర్చ కొనసాగుతోంది.