బెల్లంపల్లిలో BRS రాస్తారోకో

MNCL: బెల్లంపల్లి పట్టణం బజారు ఏరియాలో BRS ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో చేపట్టారు. రాష్ట్రంలో రైతులందరికీ సరిపడ యూరియాను వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికను CBIకి అప్పజెప్పేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రాజెక్టులో కుంగిన పిల్లర్లను మరమ్మత్తులు చేసి రైతులకు నీరు అందివ్వాలన్నారు.