భిక్షాటన చేస్తూ గుర్తు తెలియని వ్యక్తి మృతి
WGL: ఆరేపల్లిలోని అయ్యప్ప దేవాలయం సమీపంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఏనుమాముల సీఐ సురేష్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఆయన అనారోగ్యానికి గురై గురువారం రాత్రి మరణించినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.