వైభవంగా ముత్యాలమ్మ జాతర మహోత్సవాలు

వైభవంగా ముత్యాలమ్మ  జాతర మహోత్సవాలు

కోనసీమ: మలికిపురం గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు శుక్రవారం రాత్రి వైభవంగా జరిగాయి. ఈ అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారికి విశేష అర్చనలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేల తాళాలు, బాణాసంచా కాల్పులు, గరగ నృత్యాలు నడుమ అమ్మవారి విగ్రహాన్ని గ్రామంలో ఊరేగించారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.