యుద్ధం.. భారత్‌కు ఇరాన్ శుభవార్త
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్‌కు ఇరాన్ శుభవార్త చెప్పింది. చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని భారత్ కోసం తెరిచినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. భారత్‌తో సహా మిత్రదేశాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇదే విషయాన్ని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ కూడా X వేదికగా పోస్టు చేసింది.