కేంద్ర సహాయ మంత్రిని కలిసిన జిల్లా ఎస్పీ

కేంద్ర సహాయ మంత్రిని కలిసిన జిల్లా ఎస్పీ

GNTR: జిల్లా నూతన ఎస్పీ వకుల్ జిందాల్ కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌ని శనివారం ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం శాంతి భద్రతల గురించి పలు విషయాలు ఇరువురు చర్చించారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అభినందనలు తెలిపారు.