రాజ్యాంగ పీఠికను చదివిన న్యాయమూర్తులు

రాజ్యాంగ పీఠికను చదివిన న్యాయమూర్తులు

RR: షాద్ నగర్ కోర్టు కాంప్లెక్స్‌లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 16వ అదనపు జిల్లా జడ్జి స్వాతి రెడ్డి కోర్టు న్యాయమూర్తులు, సిబ్బందిచే రాజ్యాంగ పీఠికను చదివించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత భారతీయులందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కొత్త రవి పాల్గొన్నారు.