'ప్రతి ఒక్కరూ అంబేద్క‌ర్ బాటలో నడవాలి'

'ప్రతి ఒక్కరూ అంబేద్క‌ర్ బాటలో నడవాలి'

VKB: పెద్దేముల్(M) నాగులపల్లి గ్రామంలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్క‌ర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్, మాజీ సర్పంచ్, గ్రామ అధ్యక్షులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని, బాబాసాహెబ్ అడుగుజాడల్లో నడవాలని సూచించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.