శ్రీహరిపురంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు

CTR: విజయపురం మండలం శ్రీహరిపురం ZPHSలో ముందస్తు సంక్రాతి సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి గోబ్బియాళ్ళు, ఉట్టి ఉత్సవం, ఆటల పోటీలు, బోగిమంటలు వేసి పాఠశాలలో పండుగ వాతావరణంలో వేడుకలు నిర్వహించారు. విజేతలకు HM జ్ఞానప్రసాద్ బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు విజయచంద్రిక, సునీత, రాధాకుమారి, వెంకమరాజు పాల్గొన్నారు.