బాధిత కుటుంబానికి LOC అందజేసిన ఎమ్మెల్యే
JGL: జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన నాగపురి సురేశ్ గుండె వ్యాధితో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.2.50 లక్షల LOCని కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సంధ్యారాణి, నాయకులు పాల్గొన్నారు.