ముద్దిరెడ్డిపల్లిలో పర్యటించిన మున్సిపల్ ఛైర్మన్

ముద్దిరెడ్డిపల్లిలో పర్యటించిన మున్సిపల్ ఛైర్మన్

సత్యసాయి: హిందూపురం పట్టణం 37వ వార్డు ముద్దిరెడ్డిపల్లిలో హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్ కుమార్ ఇవాళ పర్యటించారు. వార్డులో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బాలకృష్ణ చొరవతో త్వరలో ముద్దిరెడ్డిపల్లిలో రోడ్లు వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగరాజు, మారుతి, హరీష్ కుమార్, అమర్ పాల్గొన్నారు.