15 ఏళ్ల తర్వాత నిండిన రామయ్య చెరువు

15 ఏళ్ల తర్వాత నిండిన రామయ్య చెరువు

రంగారెడ్డి: గూడూరు గ్రామ శివారులోని రామయ్య చెరువు 15 ఏళ్ల తర్వాత అలుగు పారింది. సుమారు 70 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ చెరువు కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నిండుకుండలా మారింది. అలుగు నీరు మూసీ నదిలో కలుస్తుంది. ఐదేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్న తాను ఇంతవరకు ఈ అలుగు పారడం చూడలేదని ఇరిగేషన్ ఏఈ రవీందర్ రెడ్డి తెలిపారు.