‘యుద్ధ కాలంలోనూ భారత్ అభివృద్ధి పరుగులు’
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నా, భారత్ మాత్రం అభివృద్ధిలో దూసుకెళ్తోందని PM మోదీ స్పష్టం చేశారు. యుద్ధ ప్రభావం అన్ని రంగాలపై ఉన్నప్పటికీ.. గత 23 రోజుల్లోనే కోటా, మధురై ఎయిర్‌పోర్టులను ప్రారంభించామన్నారు. ఢిల్లీ మెట్రో కారిడార్‌ను జాతికి అంకితం చేశామన్నారు. కష్టకాలంలో రాజకీయాలు చేయవద్దని, యుద్ధాన్ని స్వార్థానికి వాడుకోవడం తగదని విపక్షాలకు హితవు పలికారు.