రోడ్డుపై పెద్ద గుంతలు... ప్రమాదాలు జరిగే అవకాశాలు
VKB: పూడూరు నుంచి గేటుకు వెళ్లే కల్వర్టు దగ్గర రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు, పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఈ గుంతల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని కోరారు.