దివిటిపల్లిలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం

MBNR: దివిటిపల్లిలో నిర్వహించిన వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఎస్‌వీఎస్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ సౌజన్యంతో ఎంటీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. దీనిలో భాగంగా పలు రకాల వైద్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి గుండె కాలేయం, మధుమేహం, దంత మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు పరీక్షలు చేశారు.